Friday, 7 April 2017

నిన్నెంతగా ఆరాధిస్తున్నానో తెలుపలేనపుడు
ఈ నా ప్రాణమెందుకు




దిక్కులు పిక్కటిల్లేలా పిలిచినా
నా గుండెతడి తీరేదెన్నడు






I just stoped showing it to you


ప్చ్! నువ్వు నాకే సొంతమనుకున్నా
కానీ కలిసే మార్గం కనుచూపు మేరలో లేదు



Ture love isn't easy
I choose you


నా నిస్సహాయత
నిన్ను నాకు దూరం చేసింది


ఏది ఆనాటి ఆనందం
ఏమైపోయింది నా దేవత


నా కళలన్ని 
కల్లలై పోయాయి

నువ్వు విడిచి వెళ్లినా 
ఇక్కడ ఉన్నట్లుగానే ఉంది

Love doesn't have bounds
I will surely reach you


నీ దగ్గరే కదా
నాకింత స్వేచ్చ


You are my soul & whole.

How can I live without you


జిలుగు వెలుగుల సందడిలో
నా గుండె తరుక్కుపోతోంది


Unnadi okee jeevitham........

నీ రాకకై నిరీక్షిస్తున్నాను ......

దేవతలా కనిపించి .....................................

నా శ్వాస ధ్యాస నీ కోసమే
కరుణిస్తావొ లేదో

I know my sins and
I cann't forget my terrible guilt.


మన బంధాన్ని నిలుపుకోవాలని 
సతమతమౌతున్నాను
నిజంగా నీకు అన్యాయమే చేశాను
అందుకే అందనంత దూరం వెళ్తున్నాను

Thursday, 9 February 2017

మూగ గానమై
మౌన రాగమై
బూడిదలో పోసిన పన్నీరునై
గాలిలో గీసిన చిత్రలేఖమై
పరిమళించని పువ్వునై
ఈ విశ్వాoతరంలో
కలిసిపోవడం మేలూ
నా చెలిని నే చేరలేనపుడు

Wednesday, 8 February 2017

నీ జ్ఞాపకం తీయ్యని భాదను కలిగిస్తుంది
నా కళ్ళను చెమర్చుతుంది
నీతో కొంత సమయం గడపాలనిపిస్తుంది
బరువెక్కిన నా హృదయాన్ని
నీ ముందుంచాలనిపిస్తుంది
పసి పాపాల నీ ఒడిలో ఒదిగిపోవాలనిపిస్తుంది

Monday, 6 February 2017

నీ అందాల మోము
చిన్నబోయినపుడు
నీ పెదాలపై విరిసే
చిరు దరహాసాన్ని నేను
చెమ్మగిల్లిన కళ్ళతో
తడిచిన నీ చెక్కిళ్ళు
తుడిచే చెయ్యిని నేను
నీ గుండె చెప్పుడి
ప్రతిస్పందనను నేను
నిన్ను నిన్నుగా కోరుకునే
నీ తోడును నేను
నింగి వీడి నిండు జాబిలి
పండు వెన్నెలను
నాపై కురిపించిందా
అన్నట్లుగా ఉంది నీ రూపం
నిన్ను చూసేందుకు
నా రెండు కళ్ళు చాల్లేదు
చెబితే నమ్మవు కానీ
నేనెప్పుడో నీకు దాసోహమైపోయాను
నీ కొనకంటి చూపు చాలు
నన్ను ఉక్కిరిబిక్కిరి చేసేందుకు
ఈ చోటును అడిగి చూడు
నిన్ను చూడకుండా ఉండటం
నాకెంత నరకమో చెబుతుంది
హు! నువ్వు నిజంగా నిండు జాబిలివే
నాకు అందనంత దూరంగా
ఎప్పటికి కలవనట్లుగా

Saturday, 4 February 2017

మనసు కుదురుగా ఉండదు
ఎప్పుడు నీ ధ్యాసే
చిత్రమేంటంటే
పొరపాటుగానైనా
పలకరించుకుందే లేదు
ఆ నమ్మకమూ లేదు
నిజం కానీ దానికోసం
నాకెందుకో ఈ ఆరాటం 
నిన్ను చూడకుండా ఉండేందుకు
ఎంత కష్టపడుతున్నానో నాకే తెలుసు
ఏ నేరం చేశానని నాకీ శిక్ష
ఎంతకాలమీ పరీక్ష
ఈ కళ్ళు చూస్తే తెలీలేదా
నీ పరిచయం కోసం ఎంత నిరీక్షిస్తున్నానో

Thursday, 2 February 2017

కళ్ళెదురుగా తిరుగుతూ
చిత్రవధ చేస్తున్నావు
నలుగురిలో మాట్లాడటం
చేతకాక
ఒంటరిగా కలిసే దారిలేక
ఎటు తేల్చుకోవాలో
పాలుపోక
ఎన్నెన్ని పాట్లు పడుతున్నానో
నీకేమి తెలుసు


Kalleduruga tirugutu
Chitravadha chestunnavu
Nalugurilo matladatam
Chetakaka
Ontariga kalise dari leka
Yetu telchukovalo
Palupoka
Yennenni patlu padutunnano
Neekemi telusu

Wednesday, 1 February 2017

నీతో మాట్లాడకుండా ఉండటం
నా వల్లకాక
నీపై ఉన్న ప్రేమను ఎన్ని విదాలుగా
తెలపాలో పాలుపోక
నిన్ను గుర్తు చేసుకోకుండా
ఉండలేక
నా మనసులో నీకే స్థానమని
ఇంట్లో చెప్పలేక
నిన్ను ఒదులుకోవటం
భరించలేక
నేనేమిచేస్తున్నానో
నాకే అర్ధం కాక
విలవిలలాడిపోతున్నాను
ఎప్పటి పాపాన్నో
ఇప్పుడు అనుభవిస్తున్నాను
Nalugu maatalu raddunu kada
Anukunnanu
Uhu avi mana bandhanni
Telipenduku sari tugadani
Inthatithone aapestunnanu
     _ priyamina srimathiki

నాలుగు మాటలు రాద్దును కదా
అనుకున్నాను
ఉహు అవి మన బంధాన్ని
తెలిపేందుకు సరి తూగవని
ఇంతటితోనే ఆపేస్తున్నాను
     - ప్రియమైన శ్రీమతికి
Appudappudu yedabaatu kuda
Madhuramina bhavane
Naa kosam O guppedu gunde
Nereekshistu undani
Manishi kanipiste chaalu
Manasuloni premanthaa
Kallalone kanabadipotundi


 అప్పుడప్పుడు ఎడబాటు కూడా
మధురమైన భావనే
నా కోసం ఓ గుప్పెడు గుండె
నిరీక్షిస్తూ ఉందని
మనిషి కనిపిస్తే చాలు
మనసులోని ప్రేమంతా
కళ్ళలోనే కనబడి పోతుంది.